కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశానుసారం జుక్కల్ ప్రాంత రైతుల కోరిక మేరకు మండలంలోని హాంగర్గ గ్రామంలో విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడుపువ్వు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ జాగర్వార్ నరసింహులు, మాజీ విండో చైర్మన్ నగల్గిద్దే శివానంద్, కాంగ్రెస్ శ్రేణులు కే.సాయగౌడ్, రమేష్ దేశాయ్, అనిల్ సెట్, ఖండేబల్లూర్ సర్పంచ్, చాకలి కృష్ణ, బొంపల్లి రాములు, గంగాధర్ నాయక్ తో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
రైతులు తమ మొక్కజొన్నను, పొద్దుతిరుగుడు పువ్వు పంటలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాలకు 2400 రూపాయలు, పొద్దు తిరుగుడు పువ్వుకు క్వింటాలకు 7721 రూపాయల కల్పించడం జరిగిందని, రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పండించిన పంటలు దళారులకు అమ్మి మోసపోవదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు సతీష్ పటేల్, సురేష్, మనోహర్ పటేల్, ఇమ్రాన్ ఖాన్, ఏఈఓ లు నాందేవ్, సతీష్, గ్రామ పెద్దలు, రైతులు జుక్కల్ విండో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
