3 decades | సమస్యకు ప్రజాబాటలో పరిష్కారం

3 decades | సమస్యకు ప్రజాబాటలో పరిష్కారం
- ఇండ్ల పై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగల తొలగింపు పనులు ప్రారంభం
- నూతన కనెక్షన్లు, 6 విద్యుత్ స్తంభాల ఏర్పాటు
- ట్రాన్స్ కో ఏఈ ప్రభాకర్ రెడ్డి
3 decades | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాశవారి గూడెంలో 3 దశాబ్దాల నాటి విద్యుత్ లైన్ సమస్యను మంగళవారం నిర్వహించిన ప్రజా బాటలో ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరిస్తూ సిబ్బంది పనులు ప్రారంభించారు. కాశవారి గూడెం లో గత 30 ఏండ్లుగా నివాస గృహాలపై 11 కె వి విద్యుత్ తీగలు ఉండడంతో వర్షాకాలంలో తరచూ ఇండ్లకు విద్యుత్ షాక్ వస్తుండడంతో కాలని వాసులు ఆందోళన చెందేవారు.
ఇటీవల ఎమ్మెల్యే సామెల్ కి కాలని వాసులు విన్నవించడంతో సంబంధిత అధికారులను పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ప్రజాబాటలో భాగంగా ఆ కాలనిలో విద్యుత్ తీగల తొలగింపు, షిఫ్టింగ్ కోసం మరో 4 విద్యుత్ స్తంభాలు మంజూరు కాగా, మరో 2 స్తంభాలు తెప్పించి వారం రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు ఏఈ తెలిపారు.
కాలనిలో నూతన విద్యుత్ కనెక్షన్లు, మరో 6 నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట లైన్ మెన్ జాన్ రెడ్డి, జెఎల్ ఎంలు, సిబ్బంది ఉన్నారు.
