Rangareddy | తప్పిపోయిన గర్భిణీ ఆచూకీ లభ్యం

Rangareddy | తప్పిపోయిన గర్భిణీ ఆచూకీ లభ్యం
Rangareddy | మంచాల, ఆంధ్రప్రభ : డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లి, తప్పిపోయిన ఓ నిండు గర్భిణి మహిళ (pregnant woman) ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పరిధిలోని కాగజ్ ఘాట్ గ్రామానికి చెందిన స్వప్న(25), భర్త శివకుమార్ తో కలిసి మూడు రోజుల క్రితం డెలివరీ (Delivery) కోసం కోఠి ప్రసూతి ఆసుపత్రికి వెళ్లారు.
కాగా భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన స్వప్న ఆసుపత్రి నుండి బయటకు వెళ్లి, కనిపించకుండా పోయింది. 24 గంటల్లో డెలివరీ ఉందని వైద్యులు (Doctors) అప్పటికే తెలిపారు. హాస్పిటల్ లో, చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో శివకుమార్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ (Sultan Bazaar Police Station) లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, సీసీ ఫుటేజీల ఆధారంగా గర్భిణీ స్వప్న తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. స్వప్న నాంపల్లిలో ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు. ఆమెను ఈ రోజు హైదరాబాద్ కు తీసుకురానున్నారు.
