బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ: పాలకుర్తి నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక వెంకట్‌రెడ్డి సోదరి రాజశ్రీ, సోదరుడు దుబ్బాక లక్ష్మారెడ్డి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందగా, చీకటియపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు న్యాయని గౌతమ్‌రెడ్డి తండ్రి న్యాయని ప్రభాకర్‌రెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్‌కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్రచారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు గంజి విజయపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకన్న యాదవ్, చీకటియపాలెం సర్పంచ్ చిదిరాల కృష్ణమూర్తి, నాయకులు జలకం శ్రీనివాస్, సురేందర్‌రాజ్, జక్కా మహబూబ్‌రెడ్డి, చిదిరాల చంద్రయ్య, నల్లమాస సమ్మయ్య, రాజేష్ యాదవ్, యూత్ పట్టణ అధ్యక్షుడు మహేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
