Prime Minister | ఎన్డీయే విజయంపై చంద్రబాబు ట్వీట్
Prime Minister | ఎన్డీయే విజయంపై చంద్రబాబు ట్వీట్
Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంపై ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్డీయే కూటమి విజయం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు.
ఈ ఫలితాల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్డీయే మరింత బలపడిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలు అభివృద్ధి, స్థిరత్వానికి మద్దతు తెలుపుతున్నారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర నాయకులకు కూడా చంద్రబాబు అభినందనలు తెలిపారు. అలాగే నితిన్ నబీన్‌కు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ట్వీట్లో ఎన్డీయే విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, దేశాభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
