Kaleshwaram | రైతుల మహాపాదయాత్ర

చిన్నకోడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 16 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం..
కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని రైతుల డిమాండ్

Kaleshwaram | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సాగునీటి కోసం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు ఆందోళన బాట పట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మోటార్లను వెంటనే ప్రారంభించి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అన్నపూర్ణ ప్రాజెక్టు పరిధిలోని అల్లీపూర్ గ్రామంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర రంగనాయకసాగర్ వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. వేలాది మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు యాత్రలో పాల్గొన్నారు.

ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేసి సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మధ్యాహ్నం ఈ మహాపాదయాత్రలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు రైతులతో కలిసి పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.