Primary Health Center | ఘనంగా జయంతి వేడుకలు..

Primary Health Center | ఘనంగా జయంతి వేడుకలు..
Primary Health Center | మునుగోడు, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి(Palvai Govardhan Reddy) జయంతిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదేశానుసారం ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కమిటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల(Phulmala)వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Center)లో గర్భిణీలు, బాలింతలకు బ్రెడ్ లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారగోని అంజయ్య గౌడ్, పాల్వాయి యాదగిరి రెడ్డి(Palvai Yadagiri Reddy), మేకల శ్రీనివాస్ రెడ్డి, ఈద శరత్ బాబు, యడవెల్లి సురేష్, దుబ్బ రాజు, మార్తా మోహన్ రెడ్డి, మల్లేశం, జిట్టగోని మల్లేష్ యాదవ్, సురిగి లింగస్వామి, సురిగి రవి, వెంకన్న, బోయపర్తి సైదులు, వనం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

