అంగన్వాడి చిన్నారులకు ప్రోగ్రెస్ కార్డుల అందజేత..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని ఖండేబల్లుర్ గ్రామంలో గల రెండవ అంగన్వాడి కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు.అంగన్వాడీలో చేరిన చిన్నారులు విజయవంతంగా గత విద్య సంవత్సరంలో ఆటపాటలతో పాటు అక్షరాభ్యాసం పూర్తిచేసుకున్నా సందర్భంగా గ్రామసర్పంచ్ చాకలి కృష్ణ చిన్నారులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేసి మిఠాయి పంపకం చేసి అభినందించారు.అంగన్వాడి కేంద్రలు చిన్నారుల భవిష్యత్తుకు తొలిమెట్టుఅని, మొదటి ఒడి,మొదటి బడి అంగన్వాడి కేంద్రాలేఅని ఆయన అన్నారు.

అంగన్వాడి కేంద్రం నుండి మొదటి తరగతి అభ్యాసంకోసం పాఠశాలలో చేరుతునున్న ఐదుగురు చిన్నారులకు సయితం గ్రామ సర్పంచ్ చాకలికృష్ణ ఆశీర్వదిస్తూ,ఆచిన్నారులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.అంగన్వాడి కేంద్రంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్త సుమలతకు ఆయన అభినందించారు.చిన్నారుల తల్లిదండ్రులు అర్హులైన ప్రతి చిన్నారిని అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని,బాలింతలు గర్భవతులు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పి మనీలా,ఆశా కార్యకర్త రుక్మిణి, సంజీవరెడ్డితో పాటు చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply