చేంగల్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

చేంగల్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని చేంగల్ గ్రామంలో సోమవారం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో పది లక్షల రూపాయలతో రెండు కల్వర్టులు మంజూరు కావడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దుమాల రాజు అన్నారు. మంజూరైన రెండు కల్వర్టు నిర్మాణం పనులను స్థానిక నాయకుల తో కలిసి గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ పనులను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అడిగిన వెంటనే కల్వర్ నిర్మాణానికి 10 లక్షల ఎదురు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామస్తుల సమస్యలను వెంటనే స్పందించి కల్వర్టు నన్ను మంజూరుకు కృషి చేసిన ముత్యాల సునీల్ కుమార్ కు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూమల మమత (రాజు) ఏఎంసి డైరెక్టర్ నర్సాపురం జీవన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూతల రమేష్, అడపా రాజేశ్వర్, నూతల వసంత్, శోభన్ గౌడ్,గిర్ని నర్సారెడ్డి, ఆనంద్ గౌడ్,బాబా గౌడ్, తూర్పు శ్రీధర్, రాగుల మోహన్, వీడీసీ సభ్యులు, గ్రామ రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply