మహాత్మ బసవేశ్వరుని తత్వాలు..

మహాత్మ బసవేశ్వరుని తత్వాలు..
డోంగ్లి, ఆంధ్రప్రభ : కుల,లింగ,వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని యువ నాయకుడు మేంగే ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బసవేశ్వరుని జయంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి మేంగే ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దపు తత్వవేత్తగా బసవేశ్వరుడు సమానత్వాన్ని బోధించారని, అనునభవ మంటపం స్థాపించారని అన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు డి.హాన్మంత్, బస్వరాజ్, సంతోష్, దిగంబర్, మహేష్, విశ్వనాథ్, హుల్రామ్ తదితరులు పాల్గొన్నారు.
