రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

నస్పూర్, ఆంధ్రప్రభ ; నస్పూర్ పట్టణంలోని పలు కాలనీల్లో 16 సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటవరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. నస్పూర్ టౌన్ 11 కేవీ ఫీడర్లో లైన్ మరమ్మత్తుల కారణంగా విలేజ్ నస్పూర్ రోడ్, టిఆర్ఎస్ భవన్, గ్రీన్ సిటీ, అభినవ కాలనీ, ప్రగతి నగర్, పటేల్ కాలనీ ఉమామహేశ్వర్ కాలనీ, వినాయక టౌన్షిప్, రాజరాజేశ్వర టౌన్షిప్, వెంకటేశ్వర టౌన్షిప్, తిరుమల టౌన్షిప్, శ్రీరామ్ యాడ్ బ్రిక్సెస్ కూల్డ్రిఫామ్ ప్రశాంత్‌నగర్, గాంధీనగర్, జ్యోతినగర్, శ్రీరామనగర్, ఊరుశ్రీరాంపూర్, అల్లూరి సీతారాంరాజు నగర్, ఠాగూర్ నగర్, కట్టకొమ్ము గుడిసెలు ఏరియాలో విద్యుత్ అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.
