వైభవంగా సంకష్టహర చతుర్థి గణపతి హోమం

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : పురాణాల ప్రకారం మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి ‬పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి,అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందనే పురాణోక్తి ప్రకారం ఆది పరాశక్తి, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకట హర చతుర్థి సందర్బంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన యాగశాలలో శుక్రవారం గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం కార్యక్రమములను ఆలయ అర్చకులు వైభవంగా జరిపించారు. లోక క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.