పేకాట శిబిరం పై పోలీసుల దాడి..

పేకాట శిబిరం పై పోలీసుల దాడి..
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హసన్ పర్తి పోలీసులు పేకాట శిభిరం పై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, ఒకరు పరారైన ఉదంతం ఇది. హసన్ పర్తి సీఐఎ మహేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తగిన సమాచారం మేరకు హసన్‌పర్తి ఎస్ఐ పి గోవర్దన్ ఆధ్వర్యంలో సిబ్బంది కరుణాకర్, దేవేందర్, మహేందర్ లు కలిసి పోలీసు స్టేషన్ పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో, రజనీకాంత్ ఇంటి ముందు గల ఖాళి ప్రదేశములో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించగా పోలీసులను చూసి ఒక్కరు పరారయ్యారు.
చంద్రకాంత్, తాళ్ళపల్లి సురేష్, ముస్కు సురేష్, బోట్ల దివాకర్, ఉడుత రవి, మునుకుంట్ల నాగరాజులను అదుపులోకి తీసుకోగా, ముస్కు రజనికాంత్ పరారైనట్లు సీఐ తెలిపారు. కాగా వారి నుండి 8 వేల 230 నగదుతో పాటు 52 పేక ముక్కలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని. పరారైన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని అన్నారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. పేకాట, రేషన్ బియ్యం, గంజాయి, పొగాకు ఉత్తులు, అక్రమ ఇసుక రవాణా, దొంగతనాలు లాంటి సమాచారం ఉన్నట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
