మోసపోయామా? ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ మృతి

మోసపోయామా? ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ మృతి

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : 22 ఏళ్లుగా నిలిచిన హామీ జీవో 98 అమలు చేయాలని శ్రీశైలం ముంపు బాధితుల 46 రోజుల దీక్ష చేపట్టిన స్థానిక ప్రజా ప్రతినిధుల గాని అధికారులు గాని చీమకుట్టినట్టు కూడా లేదు అని ముంపు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు 2017, 2019, 2024లో హామీలే.. అమలు శూన్యం: కూటమి నేతలపై ముంపు బాధితుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో ఉండి, హామీలు ఉండి కూడా ఉద్యోగాలు లేవు నెహ్రూనగర్ జయన్న ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 46వ రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ మాకు ఇవ్వవలసిన ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా కోస్తాకు 1085 లస్కర్ పోస్టులు, రాయలసీమకు మాత్రం మొండిచేయి చూపడం చాలా బాధాకర విషయం అని అన్నారు ముంపు బాధితుల ప్రశ్న రిటైర్ లస్కర్ ఖాళీలు 205, రెండో జాబితా 674 భర్తీ చేయండి ప్రభుత్వానికి ముంపు బాధితుల హెచ్చరిక చేశారు.

నందికొట్కూరు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు జయన్న ఆవేదన వ్యక్తం చేశారు .నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రి అయిన రాయలసీమ వాసిగా మీరు మాకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే 32 మంది రైతులు కుటుంబ పోషణ భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మమ్మల్ని కనికరించరా?” అని జయన్న ప్రశ్నించారు. నందికొట్కూరు బహిరంగ సభల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే GO 98 అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 2024 యువగళం పాదయాత్రలో నారా లోకేష్, 2019లో జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ కూడా ఇదే హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.

కూటమిలోని ముగ్గురు పాలకులు హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం చేయకపోవడం దారుణమన్నారు.రాష్ట్రంపై ఆర్థిక భారం లేని రిటైర్ లస్కర్ ఖాళీలు 205 పోస్టుల్లో రెండో జాబితా 674ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసినవారవుతారని రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ దీక్షలో మౌలాలి నాగసుం కన్న నారాయణ ఆదిశివుడు, రాఘవేంద్ర, శ్రీనివాసులు, జయన్న తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరు బహిరంగ సభల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే GO 98 అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 2024 యువగళం పాదయాత్రలో నారా లోకేష్, 2019లో జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ కూడా ఇదే హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.