Police Force | నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలే….
Police Force | నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలే….
- ఎన్నికలు సాఫీగా, సజావుగా నిర్వహిస్తాం
- రూల్స్ బ్రేక్ చేస్తే కేసులే
- ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
- నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ
Police Force | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికల సంగ్రామం ప్రారంభ మైంది. ఈ రోజు నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో శాంతిభద్రతల పర్యవేక్షణపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Sunpreet Singh) ప్రత్యేక దృష్టిని సారించారు.
ఎన్నికలు సవ్యంగా, సాఫీగా, సజావుగా సాగేందుకు గాను పోలీస్ ఫోర్స్(Police Force) ను అలర్ట్ చేస్తూనే స్వయంగా ఎన్నికల కురుక్షేత్ర తంత్రాన్నీ నేరుగా పర్యవేక్షించేందుకు నడుం బిగించారు. వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈ రోజు ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను కొత్వాల్(Kotwal) సంబందిత పోలీస్ అధికారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ(receipt of nominations)కు సంబంధించిన వివరాలను రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో భద్రతాపరంగా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పని చేయడానికి సిద్ధంగా ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha), కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్ పెక్టర్ పులి రమేష్, ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


