క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన వారికి పోలీసుల కౌన్సిలింగ్

దర్శి, ఆంధ్రప్రభ: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకొని వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గురువారం రాత్రి దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ బి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇటీవల అరెస్టై రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్నట్లు తెలిపారు.
పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలతో బెట్టింగ్ రాకెట్లలో ఉన్నవారిలో భయం నెలకొన్నదన్నారు. వీరితో పాటు డబ్బు ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న సుమారు 11 మందిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి, బైండోవర్ చేసినట్లు వెల్లడించారు.
త్వరలో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలను పూర్తిగా అణిచివేస్తామని ఆయన హెచ్చరించారు. యువకులు బెట్టింగ్ అనే మహమ్మారి వలలో పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వై. రామారావు, ఎస్సైలు మల్లికార్జున, శివ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
