పారిశుద్ధ్య కార్మికులకు “కోటి” ప్రమాద బీమా…!

పారిశుద్ధ్య కార్మికులకు “కోటి” ప్రమాద బీమా…!

ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి తాలూకా సెంటర్ అన్నా కాంటీన్ ముందు జరిగిన “స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…గత ప్రభుత్వంలో చెత్త పై పన్ను వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పై పన్ను తొలగించారు. స్వచ్ఛాంధ్రకోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు కోటి ప్రమాద బీమా కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది.

ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాల నివారణకు స్వచ్ఛందంగా ప్రజలు చైతన్యంతో కట్టడి చేయాలి. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి. కాల్వలు, చెరువులు, చెక్ డ్యాంలు బాగు చేసుకోవాలి.. నీటి నిల్వకు సిద్ధంచేయాలి. భూగర్భ జలాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. “నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈరోజు నుండి నా తోటి వారికి కూడ “స్వచ్ఛత” పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి, నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని “స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర” గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్కరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అచ్చంపేట రోడ్డులో గల శివాలయం నందు శనీశ్వర జయంతి సందర్భంగా….స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలో శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారుఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply