నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవు

  • నిబంధన పాటించని వారికి జరిమానా తప్పదు సర్పంచ్ రమేష్ ,

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్‌ మండలం పెద్దమ్మ కండి తాండ గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఐస్‌క్రీమ్, కారీలు అమ్మితే రూ.1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని గ్రామ పంచాయతీ తీర్మాణం చేసింది. రోడ్డు భద్రత విషయానికి వస్తే జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ప్రాణాలకు రక్షణగా ఉండే హెల్మెట్ ధరించి వాహనాలు నడిపివ్వాలి సూచన…అలాగే ఇకనుండి గ్రామంలో మైనర్ యువకులకు వాహనాలు ఇవ్వకూడదు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపివ్వకూడదని అన్నారు.

గ్రామంలో బుధవారం సర్పంచ్‌ భుక్య రమేష్ అధ్యక్షతన గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామాభివృద్ధి కమిటీ సమావేశమై ఈ మేరకు నిర్ణయించి తీర్మాణం చేశారు.అనంతరం గ్రామ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ, గ్రామంలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలోకి ఐస్ క్రీమ్, ఆటోలు అలాగే కారి బండ్లు ప్రవేశం లేదు అనుమతి లేకుండా ఇంటింటికి తిరిగి ఎటువంటి వ్యాపారం చేయరాదు ఒకవేళ చేసిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించ బడుతుంది.

పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా తీర్మాణం చేశామని సర్పంచ్‌ భుక్య రమేష్ తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ఐస్‌క్రీమ్, అలాగే ఆటోలలో కారీలు విక్రయిస్తే వారికి రూ.1000 రూపాయలు జరిమాన విధిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత, ఉప సర్పంచ్ గణపతి, వార్డ్ సభ్యులు సంతోష్ రవి, సరిత, లలిత, సునీత, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply