బీజేపీ ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గౌడ్..

బీజేపీ ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గౌడ్..

బిక్కనూరు, ఆంధ్రప్రభ : బిక్కనూర్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గౌడ్ ను నియమించడం జరిగిందని మండల బీజేపీ అధ్యక్షులు ఉప్పరి రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తానని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. పట్టణంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Leave a Reply