పంగిడిలో ఈద్గా వద్ద సౌకర్యాల ఏర్పాట్లు..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; ముస్లిం ప్రజలు భక్తిశ్రద్ధలతో నెల రోజుల పాటు నిర్వహించిన రంజాన్ ఉపవాసాలు పురస్కరించుకొని రంజాన్ పండుగ వేడుకలు శనివారం నిర్వహించడానికి కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని పంగిడి పంచాయతీ ముస్లిం ప్రజలకు కోసం ఈద్గా వద్ద సౌకర్యాల ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకల సందర్భంగా ఈద్గా వద్ద నమాజ్ చదువుకోడానికి శుక్రవారం పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా నాయకులు ఈద్గా స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేశారు.
