Police Alert : బెజవాడ మొబైల్ షాపుల్లో తనిఖీ..
Police Alert : బెజవాడ మొబైల్ షాపుల్లో తనిఖీ..
విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ లను కొని, అమ్మే షాపులను పోలీసులు అకస్మికంగా తనిఖీలు చేశారు.
ఈ తనిఖీలలో గవర్నర్‌పేట సీఐ అడపా నాగ మురళి సిబ్బంది సిసిఎస్ సిబ్బంది 15 బృందాలుగా ఏర్పడి మొత్తం 32 షాపులలో తనిఖీలు చేసి 526 అనుమానాస్పదమైన సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఐఎంఈఐ నంబర్లు సైబర్ క్రైమ్ లో వినియోగించారా? లేక ఈ ఫోన్లు దొంగిలించినవా? కాదా అన్న విషయాన్ని పరిశీలనకు పంపించారు. ఎవరైనా సరైన పత్రాలు, ఆధార్ కార్డు తీసుకోకుండా న సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొన్నట్లయితే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొంటామని షాపుల యాజమాన్యాలను సీఐ హెచ్చరించారు.
