అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య..

కోటగిరి, ఆంధ్రప్రభ : మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
మంజీరా సరిహద్దులోని సుంకిని ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తుండగా, బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో దోమలేద్గి వద్ద ఈ ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు.
