Police | కవిత అరెస్టు

Police | కవిత అరెస్టు

Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాలోని జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ తో పాటు పలువురు ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కవితను అరెస్టు చేయడంపై తెలంగాణ జాగృతి నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌జామ్‌ కావడంతో కవితను వాహనంలో పోలీసులు తరలించారు.

ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద ఈ ర్యాలీ అనంతరం నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా కొంతమంది నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో జడ్పీ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

Leave a Reply