Devotional | బాసర ఆలయంలో భక్తుల కోలాహలం

బాసర – ఆంధ్రప్రభ – బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం భక్తుల కోలహలం నెల కొంది. మూల నక్షత్రం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి భక్తులు గోదావరి పుణ్య నదులు స్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి అక్షరాభ్యాస పూజలు దర్శనాల కోసం క్యూ లైన్ లో బారులు తీరారు.

అమ్మవారి ప్రత్యేక అక్షరాభ్యాసాల కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్న చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస పూజల కోసం గంటల కొలది క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు.

వేసవి ఎండలు అధికంగా ఉండడం ఆలయ అధికారులు మంచినీటి సరఫరా చేయకపోవడం తో భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతున్నారు. అమ్మవారి నుండి భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయకున్న త్రాగు నీది అందుబాటులో ఉంచకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నించారు. సుమారు పదివేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply