ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమమే మా బలం..
సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమమే మా బలంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 30వ డివిజన్ దేవి నగర్ మొదటి లైన్ నందు నూతన డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు గురువారం టీడీపీ శ్రేణులతో కలసి ప్రారంభించారు.

తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ పారదర్శకంగా, జవాబుదారీతనంతో పాలన అందిస్తోందని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం, సమస్యలను వెంటనే పరిష్కరించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్‌ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘు రామ రాజు, 30వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ ఘంటా కృష్ణ మోహన్,గొట్టుముక్కల వెంకీ,30వ డివిజన్ అధ్యక్షుడు లక్కంరాజు శ్రీనివాస రాజు, ఇంచార్జి కరణం వెంకట రమణ,ప్రధాన కార్యదర్శి,లక్కీశెట్టి సాయి,నాగమణి,అనురాధ,రెడ్డి శంకర్, తుంపాల వర ప్రసాద్, మురళి, రాము, రమణ, సాయి, జిల్లు, శ్రీనివాస్, సింహాచలం, రాము, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.