Sensex | నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు…

సెన్సెక్స్ 70 పాయింట్లు డౌన్


Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడిదుడుకుల మధ్య కదలాడి చివరకు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.

ముగింపు సమయానికి సెన్సెక్స్ 70.71 పాయింట్లు తగ్గి 78,009.25 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 29.85 పాయింట్ల నష్టంతో 24,366 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలు, ఇన్వెస్టర్ల అప్రమత్త వైఖరి మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.43 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 87 డాలర్ల స్థాయిలో నమోదైంది. ముడిచమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సెన్సెక్స్‌లో కొన్ని ప్రధాన షేర్లు నష్టాలను చవిచూడగా, మరికొన్ని షేర్లు లాభాల్లో నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, ఇండిగో, ఎన్టీపీసీ షేర్లు ఒత్తిడికి గురికాగా.. భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్ వంటి షేర్లు లాభపడ్డాయి.