సీఎం రేవంత్‌రెడ్డి రేపటి షెడ్యూల్..
- స్వాతంత్య్ర వేడుకలతో పాటు పలు కార్యక్రమాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న (శనివారం) పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం షెడ్యూల్ కొనసాగనుంది.
సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్ ఇలా..
- ఉదయం 8:45 నుంచి 9:00 గంటల వరకు: ముఖ్యమంత్రి నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
- ఉదయం 9:00 గంటలకు: పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
- ఉదయం 9:50 గంటలకు: గోల్కొండ కోటలో నిర్వహించే 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
- మధ్యాహ్నం 2:30 గంటలకు: సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ ప్రాంగణానికి సీఎం చేరుకోనున్నారు.
- అనంతరం సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
- ఆ తర్వాత నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
- సాయంత్రం 6 గంటలకు: లోక్‌భవన్‌లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరవుతారు.
