సామాజిక న్యాయం కోసం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ సమరశంఖం
- హల్ద్వానీ ఘటనకు నిరసనగా భారీ ర్యాలీ, సత్యాగ్రహం
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సామాజిక వివక్ష, అసమానతలు, అన్యాయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు.
ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవ గౌరవం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, అధికార ప్రతినిధి హర్షవర్ధన్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే డీసీసీ ఉపాధ్యక్షులు వేముల కృష్ణయ్య, సత్తూర్ చంద్రకుమార్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు సాయిబాబా, రాములు యాదవ్, అశోక్, బుద్దారం సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కార్పొరేటర్లు ఎంపీ ప్రవీణ్ కుమార్, అవేజ్, ఉమర్ కొత్వాల్, అనుపతి ఆంజనేయులు, రామస్వామి, తాహెర్‌తో పాటు పలువురు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
యూత్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్, సిద్ధిక్, ముస్తాక్, సుఫియాన్, అమీర్, శివ, మసూమ్, జయంత్, సోహెల్, రఫీక్, హకీమ్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ సెల్, ఓబీసీ సెల్, మైనారిటీ కాంగ్రెస్ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జిల్లా నుంచి మండల స్థాయి వరకు కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పాల్గొని ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణకు తమ సంఘీభావాన్ని చాటాయని నాయకులు తెలిపారు.
ప్రజల హక్కుల కోసం.. సామాజిక న్యాయం కోసం.. రాజ్యాంగ పరిరక్షణ కోసం.. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు.
