Weekend OTT Releases| ఇంట్లోనే ఎంజాయ్ చేయడానికి కొత్త సినిమాలు, సిరీస్‌లు సిద్ధం!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ వారం మరింత వినోదం అందనుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లిష్ భాషల్లోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఏ సినిమా ఏ ఓటీటీలోకి వస్తోంది? ఏ కొత్త వెబ్ సిరీస్ ఎక్కడ చూడొచ్చు? తెలుసుకోవాలంటే ఈ జాబితాపై ఓ లుక్కేయాల్సిందే..
తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లిష్ భాషల్లో పలు ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ వేదికల్లో విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ విన్, సన్‌నెక్స్ట్, జీ5 వంటి వేదికల్లో కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది.
తెలుగులో..
తెలుగులో ఈ వారం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సన్‌నెక్స్ట్, ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ‘నిజమే రుజువైనది’ ఈటీవీ విన్‌లో విడుదలవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘వదల’, ఆహాలో ‘ఫారెస్ట్ గార్డ్’ అందుబాటులోకి రానున్నాయి. ఈటీవీ విన్‌లో ‘ప్రేమదేశం’, ‘గమ్యం’ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
తమిళంలో కొత్త విడుదలలు..
తమిళ ప్రేక్షకుల కోసం ‘హార్ట్ ఇన్’ అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్‌లో విడుదలవుతోంది. అలాగే ‘డార్క్ ఫేస్’ సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళంలో..
మలయాళంలో ‘కట్టాలన్’ మనోరమా మ్యాక్స్‌లో రానుంది. ‘అరూపి’ చిత్రం తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్, లయన్స్‌గేట్ ప్లే వేదికల్లో విడుదల కానుంది. అలాగే ‘అచ్యుత అవతారం’ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది.
హిందీ కొత్త సినిమాల సందడి..
హిందీలో రియాలిటీ సిరీస్ ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వారానికొక ఎపిసోడ్ చొప్పున ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘కాక్‌టెయిల్ 2’విడుదలవుతోంది. జీ5లో ‘భారత్ భాగ్య విధాత’, లయన్స్‌గేట్ ప్లేలో ‘ఆఖరి సవాల్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జీ5లో ‘బాలన్ ది బాయ్’, సోనీ లివ్‌లో ‘మా ఇంటి బంగారం’ హిందీ వెర్షన్‌లు అందుబాటులోకి ఉన్నాయి.
ఇంగ్లిష్‌లో ఈ వారం భారీ సంఖ్యలో సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ది ఇన్వైట్’, ‘ది బాయ్ ఫ్రమ్ బిలో’, ‘ఐపీ మ్యాన్: కుంగ్ ఫూ లెజెండ్’, ‘జాకాస్: బెస్ట్ అండ్ లాస్ట్’ వంటి చిత్రాలు అద్దెకు అందుబాటులో ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మౌరిన్హో సీజన్ 1’, ‘రూరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్’, ‘కన్వర్సేషన్స్ విత్ ఏ కిల్లర్: ది చార్లెస్ మాన్సన్ టేప్స్’, ‘మై బ్రిలియంట్ కెరీర్’వంటి సిరీస్‌లు, సినిమాలు రానున్నాయి.
అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘రీచర్ సీజన్ 4’ పలు భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘డోంట్ సే గుడ్ లక్’, ‘ది టైలర్ ఆఫ్ పనామా’ వంటి చిత్రాలు విడుదల కానున్నాయి.
ఇతర భాషల్లో..
స్పానిష్, ఫిలిపినో, జర్మన్ భాషల్లోనూ పలు చిత్రాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఆపిల్ టీవీలో ‘ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2’, నెట్‌ఫ్లిక్స్‌లో ‘దిస్, దట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్’, ‘మనీలా’స్ ఫైనెస్ట్’, ‘టు ది మ్యాక్స్’ వంటి కంటెంట్ స్ట్రీమింగ్ కానుంది. మొత్తంగా ఈ వారం ఓటీటీ వేదికలపై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.
