Trump-Tariffs-India : భారత్ పై ట్రంప్ గుర్రు Andhra Prabha Top Story
Trump-Tariffs-India : భారత్ పై ట్రంప్ గుర్రు Andhra Prabha Top Story
- 40కి పైగా దేశాలకు అమెరికా వార్నింగ్
- చైనా వస్తువుల దారి మళ్లింపు..
- భారత్ సహా 40 దేశాలపై ట్రంప్ ఫోకస్
- ఇవన్నీ ప్రమాదకర దేశాలే
- వైట్ హౌస్ జాబితా విడుదల
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ )
తృతీయ దేశాల వాణిజ్య మార్గం దారి మళ్లినట్టు అమెరికా ఆందోళన చెందువతోంది. మితిమీరిన టారిఫ్ యుద్ధాలతో చైనా ఉత్పత్తులకు అడ్డుగోడ కట్టిన అమెరి్కా.. ఇక తన మార్కెట్ లోకి కేవలం చైనా ఉత్ప్తులు రాక నిలిచి పోవటమే కాదు.. అమెరికా సుంకాలకు అదిరిపోయిన అనేక దేశాలూ అమెరికా వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ స్థితిలో భారత్ సహా 40 దేశాలను ప్రమాదకర కంట్రీలుగా అమెరికా గుర్తించింది. ఈ జాబితాను తాజాగా విడుదల ,చేసింది. ఈ దేశాలపై ఆంక్షలు సిద్ధం చేస్తోంది.
Trump-Tariffs-India : ఆ 49 దేశాలపై ఆందోళన
ప్రత్యేక వాణిజ్య మార్గాల ద్వారా అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి చైనా ఉత్పత్తులను భారత్ అనేక దేశాలు ప్రోత్సహిస్తున్నట్టు అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణ కొరియాతో సహా 40కి పైగా దేశాలనే ప్రమాదకరమని ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది.
వైట్ హౌస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, “చట్టవిరుద్ధ రవాణాపై అమెరికా దృష్టి సారించింది. అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే ముందే , తక్కువ సుంకాలు ఉన్న మరో దేశం ద్వారా చైనా వస్తువులను పంపిస్తారు. దీనివల్ల ఎగుమతిదారులు చైనాపై విధించిన అధిక సుంకాలను తప్పించుకోగలుగుతారు. తన ఎగుమతుల మూలాన్ని మరుగుపరచడానికి చైనా మూడవ దేశాలను వాడుకుంటోందని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. “సంవత్సరాలుగా, ఈ భారీ రవాణా కుంభకోణం కమ్యూనిస్ట్ చైనా తన ఎగుమతులను 40కి పైగా దేశాల ద్వారా చట్టబద్ధం చేయడానికి వీలు కల్పించింది,” అని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో విలేకరులతో అన్నారు. గురువారం విడుదలైన అమెరికా నివేదిక “అధిక చట్టవిరుద్ధ రవాణా ప్రమాదంతో సంబంధం ఉన్న 40కి పైగా దేశాలను” ఎత్తి చూపింది. చట్టవిరుద్ధ రవాణాలో పాలుపంచుకునే అధిక ప్రమాదం ఉన్న దేశాలుగా 40కి పైగా ఆర్థిక వ్యవస్థలను ఈ నివేదిక గుర్తించింది. భారతదేశంతో పాటు, యూరోపియన్ యూనియన్ , అమెరికా పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు, ఈ జాబితాలో తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం కూడా ఉన్నాయి.
Trump-Tariffs-India : AI ఆధారిత తనిఖీలకు ప్లాన్
వివిధ ఆర్థిక వ్యవస్థలలో ప్రమాదాలు భిన్నంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. కొన్ని సందర్భాల్లో, చట్టబద్ధబద్ధ వాణిజ్య ప్రవాహాలలో ట్రాన్స్షిప్మెంట్ ఆందోళనలు కలిసిపోయి ఉంటాయి. ఇతర దేశాలు చైనాతో ముడిపడిన సరఫరా గొలుసులతో గాఢంగా
