క్రికెటర్ అభిషేక్ పోరేల్ కు షాక్..
ఆంధ్రప్రభ : అత్యాచారం, బెదిరింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బెంగాల్ క్రికెటర్, డిక్షి క్యాపిటల్ వికెట్ కీపర్–బ్యాటర్ పోరేల్కు కోర్టులో చుక్కెదురైంది. 23 ఏళ్ల పోరేల్కు పశ్చిమ బెంగాల్లోని చిన్నూరా కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు శుక్రవారం పోరేల్ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కళ్లకుటకు చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు జూన్ 23న పోరేల్పై కేసు నమోదు చేశారు. తనకు, పోరేల్కు గత మూడేళ్లుగా పరిచయం ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.
గత ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నామని ఆమె తెలిపింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో బయటపెడతానంటూ పోరేల్ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అనంతరం జూన్లో పోరేల్ను విచారించేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అతడు అందుబాటులోకి రాలేదని పోలీసులు తెలిపారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం అతడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
