పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి
- సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ ; కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్ గ్యాస్ కమర్షియల్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు, మండల కార్యదర్శి బట్టు ప్రసాద్ డిమాండ్ చేశారు. తొలుత సిపిఐ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన ధర్నా ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణిలు మాట్లాడుతూ పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడంతో రవాణా చార్జీలు పెరిగి పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కుల మతాల మధ్య ఘర్షణలు చిచ్చు పెడుతూ రాజకీయ పదం గడుపుతూ, బడా బాబులు అంబానీ, ఆదాని కార్పొరేట్ శక్తులకు పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన పెట్రోల్,డీజిల్ కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించి ప్రజల సౌకర్యం బిజెపి పార్టీ పనిచేస్తుందని గొప్పలు ప్రగల్బాలు పలికారని విమర్శించారు.
వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు గురి చేయడం కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ ఘర్షణ వాతావరణం కల్పిస్తూ,రాజకీయ పబ్బం గడుపుతూ కాలయాపన చేయడం సరైనది కాదని మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశంగా వ్యవహరించడం దేశ ప్రజలకు పెద్ద ముప్పు కలిగి ఉందని, ప్రమాదంలో భారత దేశ ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని గుర్తు చేశారు.
రాజకీయాలు కేవలం ఎన్నికలకే పరిమితం కావాలి తప్ప అభివృద్ధి సంక్షేమ పనులు అమలు చేయడంలో పార్టీలకతీతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పూనెం రంగయ్య, మండల నాయకులు మెస్సు గోపాల్, అటికం శేఖర్,బొర్ర వెంకన్న, పూనెం లక్ష్మణ్, మంగ, గొగ్గెల గాదెరాజు, వాగబోయిన రాంబాబు,పూసం రాంబాబు,ఎనగంటి లాజర్,తోట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
