భూపాలపల్లిలో క్రీడలకు ఊతం

భూపాలపల్లిలో క్రీడలకు ఊతం

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి:

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కబడ్డీ మ్యాట్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం కబడ్డీ పోటీలకు శ్రీకారం చుట్టి క్రీడాకారులతో కలిసి కొంతసేపు కబడ్డీ ఆడి వారిని ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో క్రీడా సదుపాయాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత క్రీడలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి టౌన్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, యువజన సర్వీసుల శాఖ అధికారి చిర్ర రఘు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply