Digitalization | పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి
Digitalization | పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి
- ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన
Digitalization | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని ఈ రోజు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారమని, ఇందులో మార్పుల పేరుతో కార్మికుల హక్కులను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం వంటి చర్యల వల్ల అనేక మంది ఉపాధి శ్రామికులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి హామీ మహిళా శ్రామికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పనులు కల్పించి, ఉపాధి శ్రామికులకు సకాలంలో వేతనాలను చెల్లించాలన్నారు. ఎంపీడీవో రవి ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
