గోహత్యల షెల్టర్ హౌస్‌లపై చర్యలు తీసుకోవాలి..

గోహత్యల షెల్టర్ హౌస్‌లపై చర్యలు తీసుకోవాలి..
మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రం అందచేత
గోరక్ష స్టేషన్ ఘన్ పూర్ పసునూరి సందీప్ కుమార్
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కొనసాగుతున్న గోహత్యల షెల్టర్ హౌస్‌లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కు గోరక్ష స్టేషన్ ఘన్ పూర్ పసునూరి సందీప్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో నిర్వహి స్తున్న షెల్టర్ హౌస్‌లలో చాలా గోహత్యలు జరుగుతున్నాయి.
ఈ అంశంపై మున్సి పల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల భావో ద్వేగాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఈ విషయాన్ని పరి శీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
