Pedana | రక్తదాన శిబిరం..

Pedana | పెడన, ఆంధ్రప్రభ : నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంపును పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక ధీరుడని కొనియాడారు.
సినీరంగంలో ఆయన రాముడు, కృష్ణుడు లాంటి ఎన్నో పాత్రలలో నటించి తెలుగు సినిమాకు ఆయన ఒక ఐకాన్ అన్నారు. దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహనీయుడు అన్న ఎన్టీ రామారావు అని.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చెప్పి ఆనాడు ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను చూసి నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి బాటలోనే నడుస్తున్నారని, ఆ మహానుభావుడు స్ఫూర్తి ప్రజలందరిలో ఇంకా ఉందని తెలిపారు.
