Pawankalyan | వైసీపీ ఆర్థిక విధ్వంసంతో 30ఏళ్లు వెనక్కి…

Pawankalyan | వైసీపీ ఆర్థిక విధ్వంసంతో 30ఏళ్లు వెనక్కి…
Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చంద్రబాబు ఆధ్వర్యంలో 11.75శాతం గ్రోత్ రేట్ సాధించామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ద్రవ్య వినిమియ బిల్లుపై శాసనసభలో పవన్ మాట్లాడారు.
వైసీపీ విధ్వంసంతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల మేర అప్పులు తమపై ఉంచి వెళ్లిందన్నారు. రూ.35 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారన్నారు. తాము రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రూ.8,700 కోట్లు నిధులు నిరుపయోగమయ్యాయన్నారు.
