Bandla Ganesh | నిరంజన్‌కు రూ.5 లక్షల సాయం
Bandla Ganesh | నిరంజన్‌కు రూ.5 లక్షల సాయం
బాలుడికి అండగా బండ్ల గణేశ్
Bandla Ganesh | ఆంధ్రప్రభ, హనుమకొండ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ శనివారం పరామర్శించారు. హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లిన బండ్ల గణేశ్ బాలుడికి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నిరంజన్ చికిత్స కోసం తన వంతు సహాయంగా రూ.5 లక్షల చెక్కును కుటుంబానికి అందజేశారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిరంజన్‌ను కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సందర్శనతో బాలుడి పరిస్థితి గురించి తెలుసుకున్న అనంతరం తాను కూడా స్పందించి సహాయం అందించినట్లు బండ్ల గణేశ్ తెలిపారు. బండ్ల గణేశ్ చేసిన ఆర్థిక సాయంపై నిరంజన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మానవత్వాన్ని స్థానికులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు.
