cricket | మూడేళ్ల ఒప్పందంతో కీలక బాధ్యతలు
cricket | మూడేళ్ల ఒప్పందంతో కీలక బాధ్యతలు
cricket | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో కీలక నియామకం జరిగింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడును ఆపరేషన్స్ హెడ్‌గా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
హెచ్‌సీఏకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల కాలానికి సంబంధించిన ఒప్పందంపై ఆయన సంతకం చేశారు.
శిక్షణ, సెలక్షన్స్‌తో పాటు క్రికెట్‌కు సంబంధించిన అన్ని పరిపాలనా వ్యవహారాలను రాయుడు పర్యవేక్షించనున్నారు. తెలంగాణలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికితీయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత క్రికెట్‌ను ప్రోత్సహించడం, వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు రాయుడు స్పష్టం చేశారు.
