Passes Away : మాజీ ఐఏఎస్ బీవీఆర్ కన్నుమూత Andhra Prabha News
Passes Away : మాజీ ఐఏఎస్ బీవీఆర్ కన్నుమూత Andhra Prabha News
- బెంగళూరులో తుదిశ్వాస
- అత్యున్నత హోదాల్లో విశిష్ట సేవలు
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కీలక పాత్ర
- విద్యారంగానికి సేవలందించిన బీవీఆర్
- ప్రముఖుల సంతాపం
( ఆంధ్రప్రభ, అమరావతి)
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.వి. రామారావు (86) బెంగళూరులో ఆయన కుమారుని నివాసంలో గురువారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. 1962 బ్యాచ్‌కు చెందిన ఆయన, కేంద్రంలోను,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో విశేష సేవలు అందించారు.
Passes Away : అత్యున్నత సేవలు
బి.వి. రామారావు తన సుదీర్ఘ ప్రస్థానంలో విద్యాశాఖ కార్యదర్శిగా, ఏపీఐఐసీ (APIIC) మేనేజింగ్ డైరెక్టర్‌గా, పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Acting Chief Secretary) కూడా ఆయన సేవలందించారు.
Passes Away : విద్యారంగంలో విశేష కృషి…..
ప్రభుత్వ సేవ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన విశ్రమించలేదు. విద్య వ్యాపార రంగాలపై ఉన్న మక్కువతో ఇక్ఫాయ్ (ICFAI) స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్‌గా బాధ్యతలు చేపట్టి, భావి తరాలకు దిశానిర్దేశం చేశారు. నిబద్ధత గల అధికారిగా, విద్యావేత్తగా ఆయన పేరు గడించారు. ఆయనకు భార్య మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు ఐఏఎస్ అధికారులు, ప్రముఖులు మరియు విద్యావేత్తలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని ప్రకటించారు.
