Varni | గ్రామ వికాసానికి కృషి చేస్తాం..

Varni | వర్ని, ఆంధ్రప్రభ : గ్రామంలో పెరిగిపోతున్న కోతుల బెడదను అరికట్టడంతో పాటు, గ్రామ వికాసానికి కృషి చేస్తామని, గ్రామాల్లో సంపద సృష్టించడానికి బాటలు వేస్తామని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ అభ్యర్థి చిక్కాల రజిత సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చూస్తామన్నారు. మహిళా స్వయం సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ రజిత సుబ్రహ్మణ్యం ఇంటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Leave a Reply