Betting Apps | బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ రంగ ప్ర‌వేశం !

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారాన్ని తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చని చెప్పుకుంటూ యువతను తప్పుదారి పట్టించి… బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

ఈ కేసులో ఇప్పటికే 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ప్రవేశించింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను ఈడీ తెప్పించుకుంది.

ఇప్పటివరకు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన యూట్యూబర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పూర్తి వివరాలను ఈడీ కోరింది. మనీలాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.

Leave a Reply