ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..
- 84 మంది లబ్ధిదారులకు రూ.69.16 లక్షలు అందజేత
ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు: సంతమాగులూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుతో కలిసి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నారని తెలిపారు.
అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు రూ.69 లక్షల 16 వేల విలువైన చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. అలాగే గత రెండు సంవత్సరాల కాలంలో CMRF కింద మొత్తం 2,938 మంది లబ్ధిదారులకు రూ.25 కోట్లు 31 లక్షల 79 వేల ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోందని, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
