Parcel | వింత ఘటన…

Parcel | వింత ఘటన…

Parcel | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : రీల్స్ కోసం బెంగళూరులో ఓ కూతురు తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరక్కపోతే పడే ఇబ్బందులను చెప్పడానికి.. తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది. కానీ గోనె సంచిలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించడంతో విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వ్యాలీకావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక భారీ పార్శిల్‌ను కొరియర్ సెంటర్‌కు తీసుకువచ్చారు. పార్శిల్‌లో కదలికలను గుర్తించిన సిబ్బంది దాన్ని తెరిచి చూడగా, లోపల ఒక వృద్ధుడు కనిపించాడు. రీల్స్ తీయడం కోసమే ఇలా చేశామని, బస్సు టికెట్లు దొరక్కపోవడంతో ఈ ఫన్నీ ప్లాన్ చేశామని కుమార్తె వెల్లడించింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply