ఉద్యోగాల కల్పన కూటమి లక్ష్యం….!

దుష్ప్రచారం వైసీపీ పని….!
మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శ.

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ద్వారా లక్షలాది నిరుద్యోగ యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

మెగా డీఎస్సీకి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న భారీ ఆదరణను చూసి ఓర్వలేకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని తెలిపారు. దీని వల్ల అనేక కుటుంబాలకు భరోసా కలుగుతోందని చెప్పారు.

యువతకు ఉద్యోగాలు వస్తుండటం వైసీపీకి కడుపుమంటగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర యువత భవిష్యత్తుపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ మాత్రం ప్రజల్లో గందరగోళం సృష్టించే దుష్ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు.

రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు.

Leave a Reply