చిన్న కొండూరులో తెలంగాణ యాది సభ

చిన్న కొండూరులో తెలంగాణ యాది సభ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్ మాతృమూర్తి బాలమణి 10వ రోజు స్మరణ కార్యక్రమాన్ని సోమవారం చిన్న కొండూరులో నిర్వహించారు. స్వగ్రామంలో ఈ కార్యక్రమాన్ని ‘తెలంగాణ యాది సభ’ రూపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రముఖులు హాజరయ్యారు. బాలమణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొంగు ప్రసాద్ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఈ యాది సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ బహుజన నాయకులు విజిఆర్ నారగోని, నల్ల సూర్యప్రకాష్, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసీ సురేష్, మహిళా నాయకురాలు సరస్వతి హాజరై నివాళులర్పించారు. హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్ యాదవ్, గీతా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమట భూపాల్, మధు భూంపల్లి, రాకేష్ నాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, పెద్ద కొండూరు గ్రామ సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ పాల్గొన్నారు. స్థానిక గౌడ సంఘం నాయకులు ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, జంగయ్య గౌడ్, ముత్యాలు గౌడ్, బొంగు అంజన్ కుమార్ గౌడ్, గ్రామస్తులు పాల్గొని బాలమణికి శ్రద్ధాంజలి ఘటించారు.

Leave a Reply