చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌ కి లేదు

చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌ కి లేదు

  • ఎమ్మెల్యే బడేటి చంటి

ఆంధ్ర ప్రభ, ఏలూరు బ్యూరో:

ఫ్యాక్షనిజాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తద్వారా రాజకీయ హత్యలకు నాంది పలికిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహర్‌ రెడ్డి విధ్వంసకారునిగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్‌ రెడ్డికి లేదంటూ ఆయన విరుచుకుపడ్డారు.

ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఖండించారు. సొంత తల్లి, చెల్లి అవసరాలను తీర్చలేని జగన్‌, రాష్ట్ర ప్రజల అవసరాలను ఏ విధంగా తీర్చగలరనే ప్రశ్నను ఎవరికి వారు వేసుకోవాలని ఆయన హితవు పలికారు.

రాష్ట్రంలో అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతోన్న తీరుచూసి ఓర్వలేని తనంతో జగన్‌ మావిగన్‌ అనే కొత్త రాగాన్ని ఎత్తుకున్నారని, ఇవేమీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదంటూ కొట్టిపడేశారు. అసలు రాష్ట్రంలో వైసిపికి ఓటుబ్యాంకు ఉందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే బడేటి చంటి, ఇదేవిధంగా తుప్పు పట్టిన అరాచకపు ఆలోచనలతో దుర్మార్గాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో వైసిపి రాజకీయ ఉనికిని కోల్పోక తప్పదంటూ ఘాటుగా హెచ్చరించారు. వైసిపికి ఓటువేసే బదులు నోటాకు ఓటువేయడమంత ఉత్తమమైన మార్గం మరొకటి లేదంటూ ఆయన తనదైన శైలిలో ప్రజలకు హితవు పలుకుతూ, వైసిపి అధినేత జగన్‌పై వాగ్బాణాలను సంధించారు.

ఈ సమావేశంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పాల్గొన్నారు.

Leave a Reply