కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి

  • సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారధి

తొర్రూరు, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ్ సారధి కోరారు. డివిజన్ కేంద్రంలోని శనివారం తొర్రూరు మండల కౌన్సిల్ సమావేశం కామ్రేడ్ గణపురం లక్ష్మణ్ అధ్యక్షతన లయన్స్ భవనంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి,ఈరోజు నెహ్రూ గతంలో ప్రధానమంత్రిగా చేసిన పని దినాములను, మోడీ ప్రభుత్వం దాటిపోయిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారని, నిత్యవసర సరుకులు, గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని విమర్శించారు.

సామాన్య ప్రజల పైన అధిక భారం పడిందని, పేద ప్రజల నడ్డి వీరస్తున్నారని అన్నారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని,లేనియెడల భారత కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబడతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన కేంద్ర ప్రభుత్వ నిధులను రాకుండా చేస్తూ కేంద్రం వివక్షతకు పాల్పడుతుందని అన్నారు. కార్మికులు సాధించుకున్న కులం నేల రాస్తూ మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ చట్టాలను తీసుకొని వచ్చి కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది అని అన్నారు.

రాబోయే రోజుల్లో మండలంలో పార్టీ విస్తృత పరిచి నూతన శాఖలు ఏర్పాటు చేయాలని, మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ జాతాలు నిర్వహించి గ్రామాలలో ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు.కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు ఓమ బిక్షపతి, మండల కార్యదర్శి బందు మహేందర్, మండల సహాయ కార్యదర్శిపెరబోయిన కిరణ్, , బూర్గు యాదగిరి, మంగళపెల్లి మల్లయ్య, చంద్రయ్య, బొల్లు వెంకన్న, కసాని వెంకన్న , కోటగిరి కృష్ణ, వెంకన్న,కృష్ణమూర్తి, పసుల యాకయ్య, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.