ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ చేసిన వాకర్స్..

ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ చేసిన వాకర్స్..
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని హసన్ పర్తి కిట్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొక్కకుమార్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మండల కేంద్రంలోని పలు ఆసుపత్రులలో రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈసందర్భంగా అధ్యక్షులు బొక్క కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆనాటి సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు.
అంబేద్కర్ మార్గంలో నడుస్తూ.. ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. దేశ పౌరులుగా ప్రాథమిక హక్కులను అనుభవిస్తూ బాధ్యతలను కూడా నెరవేర్చి, దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 303 జిల్లా డిప్యూటీ గవర్నర్ నాగమల్ల సుధీర్ గౌరవ అధ్యక్షులు శ్రీధర్, అసోసియేషన్ కార్యదర్శి చకిలం చంద్రశేఖర్, జిల్లా బాధ్యులు కోశాధికారి గూడూరు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుల్లదుర్గరాం, సలహాదారులు బోడ యుగంధర్ మురాల శంకర్రావు ఆకుల సదానందం, ప్రభాకర్ రెడ్డి, కనపర్తి రమేష్, వివేక్ వర్ధన్ రెడ్డి, చెన్నూరి సత్యనారాయణ, మసన కుమార్, దాది మధు, గాలి సత్యనారాయణ, బోడ సారంగపాణి, వల్లాల శ్రీకాంత్, పాపయ్య శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రాజారపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
