CPI | ప్రజా వ్యతిరేక విధానాల పై..

CPI | ప్రజా వ్యతిరేక విధానాల పై..
CPI | నరసరావుపేట, ఆంధ్రప్రభ : డిసెంబర్ 4వ తేదీన దాచేపల్లి సీపీఐ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని ఆ సమావేశం జయప్రదం చేయాలని ఏరియా కార్యదర్శి సత్యనారాయణ రాజు కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి. ఈశ్వరయ్య, సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన భవిష్యత్తు కార్యక్రమం రూపొందించేందుకు అదే విధంగా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం కోసం జరిగే సమావేశంలో సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ చిన్న జాను సైదా, సీపీఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, సీపీఐ నాయకులు జరీనా, సూరి నాయుడు, రాము, రుక్మిణి అమ్మ తదితరులు పాల్గొన్నారు.
